పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రత పెంచినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన బోస్ గతేడాది నవంబర్ లో బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై నియమించిన విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.