షిర్డీకి వచ్చే సాయి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్. సాయి దర్శనం కోసం భక్తులు వేచి చూసే మార్గంలో ఏసీ సదుపాయం కల్పించనుంది. రూ.109 కోట్ల వ్యయంతో భారీ కాంప్లెక్స్ నిర్మాణం సహా భక్తులకు ఉపయోగపడేలా సౌకర్యాలు సైతం ఏర్పాటు చేస్తామని తెలిపింది. సౌకర్యవంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో భక్తులు సాయి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు ఉంటాయని పేర్కొంది. మరోవైపు, షిర్డీ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల సౌకర్యార్థం కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మించనున్నట్లు రెవెన్యూ మంత్రి తెలిపారు.