మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఓ గిరిజనుడు కోర్టుకెక్కాడు. కంతూ అలియాస్ బీల్ (35)ను గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడనే ఆరోపణలతో పోలీసులు జైలుకు పంపారు. అయితే, రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం అతను అమాయకుడని తేలడంతో రిలీజ్ అయ్యాడు. ఈ క్రమంలో తనకు రూ.10,006 కోట్ల పరిహారానికి ప్రభుత్వంపై దావా వేసినట్లు తెలుస్తోంది. జైలుశిక్ష తన జీవితాన్ని తలకిందులు చేసిందని.. దేవుడు ప్రసాదించిన జీవితంలో ఎన్నో విలువైన క్షణాలను దూరం చేసుకున్నానని పిటిషన్ లో పేర్కొన్నాడు.