ఢిల్లీలో ఓ ఏఎస్ఐ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. మంగళవారం రాత్రి ద్వారకా ప్రాంతంలో తన కారుతో 6 వాహనాలను ఢీకొట్టాడు. విచక్షణారహితంగా కారు నడుపుతూ రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఏఎస్ఐ సహా నలుగురు తీవ్రంగా గాయపడగా.. వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఏఎస్ఐ నుంచి రక్త నమూనాలు సేకరించామని.. అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa