అమెరికా జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వస్తోన్న ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూత్రం పోశాడు. గతేడాది నవంబర్ 22న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని క్యాబిన్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోకపోవడంతో.. బాధితురాలు టాటా సంస్థ ఛైర్మన్ చంద్రశేఖరన్ కు లేఖ రాశారు. ఆ తర్వాతే దీనిపై విచారణ మొదలైంది. భోజనం తర్వాత తనపై ఈ దాడి జరిగినట్లు బాధితురాలు ఆరోపించింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది.