బాలానగర్ మండలము కూకట్ పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేరువేరు బైక్ లపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం చికిత్స కోసం క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మియాపూర్ నుండి కూకట్పల్లి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడం వలన ఉదయం ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేశారు