పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులను ఆపడం లేదు. ఈ వేధింపులు భరించలేక ఇప్పటికే చాలామది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్ యాప్ ల వేధింపులకు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలానికి చెందిన యువకుడు బలి అయ్యాడు. మండలంలోని ఏపీ కాలనీకి చెందిన జానకిరామ్(25) ఓ లోన్ యాప్ నుండి 80 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు తిరిగి కట్టకపోవడంతో యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. నెల రోజులుగా అయ్యప్ప మాలలో ఉన్న జానకీరామ్, నిన్న సాయంత్రం మాల తీసేసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.