నైజీరియాలో 6 నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి మర్మాంగ్ పూర్తిగా తెగిపోయింది. ఈ క్రమంలో బెంగుళూరు ఫోర్టీస్ ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక శస్త్ర చికిత్సతో దాన్ని తిరిగి అతికించారు. రెండు దశల శస్త్ర చికిత్స అనంతరం మూత్ర విసర్జనకు సమస్య లేకుండా చేశామని.. మూడో దశలో మూత్రనాళాలను ఏర్పాటు చేయాల్సి ఉందని యూరో అంకాలజీ విభాగం డైరెక్టర్ మోహన్ కేశవమూర్తి తెలిపారు. 6 నెలల తర్వాత మరో శస్త్రచికిత్స చేస్తామని తెలిపారు. బాలుడు పెద్దయ్యాక వైవాహిక జీవితం గడిపేందుకు ఎలాంటి సమస్య ఉండదన్నారు.