క్రికెటర్ రిషబ్ పంత్ ను మెరుగైన చికిత్స కోసం ఇవాళ ముంబై తరలించనున్నారు. ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. డిసెంబర్ 30న పంత్ కారు ప్రమాదానికి గురి కాగా అతను తీవ్రంగా గాయపడ్డాడు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో రిషబ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, బీసీసీఐ డాక్టర్లు పంత్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారు. అతని మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.