సీఎం జగన్‌రెడ్డి తుగ్లక్, హిట్లర్ల మాదిరిగా నియంత పాలనకు తెరతీశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో ర్యాలీలు, రోడ్‌షోలు, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తూ జీవో విడుదల చేయడం దుర్మార్గమని ఖండించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు మానుకుంటారా? అని ప్రశ్నించారు. తక్షణమే చీకటి జీవోను ఉపసంహరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు.