తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టైంస్లాట్ సర్వ, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 71,924 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 15,771 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ జారీ కేంద్రాలను టీటీడీ కుదించింది. నేటి నుంచి 4 కేంద్రాల్లో మాత్రమే టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. అలిపిరి, శ్రీనివాసం, విష్ణునివాసం కేంద్రాల్లో టోకెన్లు జారీ చేయనున్నారు. గోవిందరాజస్వామి కేంద్రాల్లో దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.