అమెరికాలోని ఉటా రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. ఓ ఇంట్లో సాధారణ తనిఖీ నిమిత్తం వెళ్లినప్పుడు మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. నిందితుల వివరాలు తెలియలేదని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa