కందుకూరు తొక్కేసలాట ఘటనలు హైదరాబాదులో పోలీసులు అరెస్టు చేసిన ఇంటూరి సోదరులకు కందుకూరు న్యాయమూర్తి పూర్ణిమదేవి శుక్రవారం తెల్లవారుజామున బెయిల్ మంజూరు చేశారు. టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఇంటర్ నాగేశ్వరరావు, టిడిపి నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ ను కందుకూరు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పూర్ణిమాదేవి ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఇద్దరికీ చెరొక 10వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేశారు. నేతలపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని చెబుతూ, ఇద్దరికీ రిమాండ్ విధించాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు.