విదేశీ వర్శిటీలు ఇక భారత్ లో తమ క్యాంపస్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. చరిత్రలో తొలిసారి యూజీసీ దీనికి అనుమతిస్తూ సంబంధిత ముసాయిదాను విడుదల చేసింది. అడ్మిషన్ ప్రక్రియ, ఫీజును నిర్ణయించడం సహా ఇక్కడ వచ్చిన నిధుల్ని స్వదేశానికి పంపుకొనే అవకాశాన్ని విదేశీ వర్శిటీలకు కల్పించింది. అయితే ఆ వర్శిటీలో భారతీయ క్యాంపస్ ల్లో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలి. డిస్టెన్స్, ఆన్ లైన్ కోర్సులకు అనుమతి లేదు.