పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనంలో కొత్తగా చికెన్, సీజనల్ పండ్లు అందజేయాలని నిర్ణయించింది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల పాటు వీటిని స్కూల్ పిల్లలకు అందజేయనున్నారు. ఇందుకోసం సర్కారు అదనంగా రూ.371 కోట్లు మంజూరు చేసింది. 1.16 కోట్ల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.