అక్రమ మైనింగ్ కేసు విచారణకు వచ్చిన సిట్ అధికారులపై గ్రామస్తులు రాళ్లదాడి చేసిన ఘటన రాజస్థాన్ లోని ధోల్పూర్ లో జరిగింది. అక్రమ మైనింగ్ కేసుపై విచారణకు వచ్చిన అధికారులు గ్రామంలోని ట్రాక్టర్లలో అక్రమ మైనింగ్ సామాగ్రిని గమనించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని ట్రాక్టర్లను సీజ్ చేశారు.