రాజస్థాన్ లోని జైసల్మేర్ కి చెందిన నారపత్రం ఓ సాధారణ వ్యక్తి. రూపాయి కూడా సంపాదన లేని అతనికి ఏకంగా కోటికి పైగా పన్ను కట్టాలని నోటీసు వచ్చింది. పొరపాటున తెలియని వ్యక్తికి ఆధార్, పాన్ వివరాలు ఇవ్వగా.. ఆ వివరాలతో దుండగులు ఢిల్లీలో కంపెనీని ఏర్పాటు చేశారు. సంస్థ టర్నోవర్ కోట్లకు పెరగడం వల్ల పన్ను కట్టమని డిసెంబర్ 22న నోటీసులు వచ్చాయి. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.