త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందే విస్తరణ చేపట్టే అవకాశాలున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈ విస్తరణలో పెద్దపీట వేయనున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు విస్తరణలో పెద్దపీట వేయనున్నారు. ఏపీ, తెలంగాణకు నుండి కూడా ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది.