ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా బెల్లంతో రాగిజావ అందించాలని అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 1నుండి వారానికి మూడు రోజుల చొప్పున రాగిజావ ఇవ్వాలన్నారు. పిల్లల్లో కాల్షియం, ఐరన్ లోపాల నివారణకు రాగిజావ ఉపయోగపడుతుందన్నారు. అన్ని స్కూళ్లు, అంగన్ వాడీలకు సార్టెక్స్ పోర్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించారు.