సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సీబీఐ, ఈడీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసుల విచారణలో ఆలస్యంపై మందలించిన సుప్రీంకోర్టు, ఇప్పటివరకు ఎన్ని ఆర్థిక కుంభకోణాల కేసులను తేల్చారో చెప్పండని ఆదేశించింది. 'కేసుల భారం ఎక్కువగా ఉండొచ్చు. సిబ్బంది సరిపడా లేకపోవచ్చు. కానీ అసలైన వ్యవస్థ లేదు. సీబీఐలోని అధికారులంతా ఇతర శాఖల నుండి డిప్యూటేషన్లపై వచ్చినవారే. వారికి విచారణల గురించి తెలియదు. అందుకే ఏళ్లతరపడి కేసులను కొనసాగిస్తారు' అని వ్యాఖ్యానించింది.