ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆప్ సన్నాహాలు ప్రారంభించింది. రాబోయే ఎన్నికల్లో మొత్తం 200 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఈసారి త్రిముఖ పోరు ఖాయమనిపిస్తోంది. ఆప్ ఎన్నికల వ్యూహకర్త సందీప్ పాఠక్ పార్టీ రాజస్థాన్ యూనిట్ నాయకులు, వాలంటీర్లతో గురువారం కీలక సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.