గుంటూరు పట్టణంలో ఓ కళాశాలలో గురువారం జూనియర్ విద్యార్థి, సీనియర్ విద్యార్థి బాత్రూం వద్ద ఎదురుపడి, ఎవరు ముందుకు బయటకు వెళ్లాలనే విషయంలో గొడవపడ్డారు. సీనియర్లు, జూనియర్లు రెండు వర్గాలు గా ఏర్పడి ఘర్షణకు దిగారు. గొడవ పెద్దదవుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి రెండు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థులకు పట్టాభిపురం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.