జైనులు పవిత్రంగా భావించే ఝార్ఖండ్ ‘సమ్మేద్ శిఖర్ జీ’ ప్రదేశం ఉన్న పార్శ్ నాథ్ కొండపై పర్యాటకం నిలిపేస్తున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. ఆ ప్రాంతంలో మద్యం, మాంస వినియోగం, అమ్మకాలు నిషేధించి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ‘మరంగ్ బురు’గా వ్యవహరించే ఈ కొండపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని గిరిజన సంఘాలు వెల్లడించాయి.