అసోంకు చెందిన వాహిదా బేగం తన కుమారుడితో నాగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. గతేడాది నవంబర్ 10 నుంచి ఆమె కుమారుడితో సహా కనిపించకపోవడంతో తల్లి అజిఫా పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో తన కుమార్తె, మనవడు పాక్ జైలులో ఉన్నారని ఓ లాయర్ నుంచి ఆమెకు వాట్సాప్ కాల్ వచ్చింది. దీంతో తన కుమార్తె, మనవడిని రక్షించాలని ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. నేడు విచారణ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa