పెనుకొండ పట్టణంలోని స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించ జరిగింది. ఈ సందర్బంగా శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని సంక్రాంతి పండుగలు అయినటువంటి భోగి, కనుమ, మకర సంక్రాంతి, విశిష్టతను తెలిపే విధంగా ముగ్గుల వేయడం జరిగింది అదేవిధంగా హరిదాసు, గొబ్బెమ్మల ప్రతిమలతో ముగ్గుల పోటీలో వాళ్ళ ప్రతిభను చూపించడం జరిగింది. దాదాపుగా 30 మంది విద్యార్థులు ఈ ముగ్గల ను వేశారు. దీంట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులు బహుమతులను శనివారం రోజున ప్రధానం చేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జయప్ప, బోటనీ అధ్యాపకురాలు డాక్టర్ శ్రీదేవి, చరిత్ర అధ్యాపకులు డాక్టర్ కె ప్రతాప్, కళావతి, ఓబులేసు, రంగనాయకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa