ఏపీలోని అనంతపురంలో శ్రావణి(26) అనే వివాహిత సూసైడ్ చేసుకుంది. ఆమెకు తన మేనమామ దుర్గాప్రసాద్ తో 8ఏళ్ల క్రితం వివాహమైంది. ఐదో రోడ్డులో నివాసముంటున్న వీరికి మూడేళ్ల కూతురు ఉంది. దంపతుల మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు తలెత్తి గొడవలు జరిగేవి. గురువారం మధ్యాహ్నం భార్య భర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. శ్రావణికి తన భర్త తీరు నచ్చేది కాదు. గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆమె సూసైడ్ చేసుకుంది.