వ్యవస్థలో సమూల మార్పులు చేసి పునర్ వ్యవస్థీకరణ చేయడం ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే చెల్లిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బుడి ముత్యాల నాయుడు అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కే కోటపాడు మండలం మేడిచర్ల గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తొలుత ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని, యేసు క్రీస్తు ప్రార్థన మందిరంలో ప్రార్థనలు చేసారు. అనంతరం17. 50లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వై. యస్. అర్ విలేజ్ క్లినిక్ ను మంత్రి ప్రారంభించారు. తదుపరి 21 లక్షలు రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం కూడా ఆయన ప్రారంభం చేశారు. గ్రామంలో 80 లక్షల రూపాయలతో జల్ జీవన్ మిషన్ ద్వారా 300 ఇంటి కులాయిలు ఏర్పాటు, అదనపు నీటి అవసరాల నిమిత్తం 40 వేల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంక్, మరో 10 వేల లీటర్ ల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థల సేకరణకు ప్రతిపాదన చేశారు. అలాగే ఇల్లు లేని వారికి 19 జగనన్న గృహాలు మంజూరు చేశారు. శిధిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాల ఆధునీకరణ చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ సీయం ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీ, సి సి, రోడ్ల ఆధునీకరణ పనులకు నిధులమంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అంగన్వాడి కేంద్రాల సందర్శించి అక్కడ పిల్లలకి అందిస్తున్న పౌష్టికాహారం పై అరా తీసి పిల్లలతో ముచ్చటించారు.
సాంకేతిక కారణాల వల్ల అగిన సంక్షేమ పథకాలు సమస్యలునీ మంత్రి బుడి పరిష్కరించారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి అందుకుంటున్న పధకాలు గురించి వివరిస్తూ, గడచిన మూడేళ్ల కాలంలో ప్రతి ఇంటికి అందిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా పెంచిన పించనుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి అనురాధ, ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ ఎంపీడీవో శచిదేవి, మండల స్థాయి నాయకులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.