ప్రజా ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం విశాఖలోని ఓ హోటల్‌లో మూడు రోజుల పాటు జరిగే భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వైద్యుల సంఘం (ఏఏపీఐ) నిర్వహించిన 16వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సందేశం పంపించారు. ఆ సందేశాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సదస్సులో చదివి వినిపించారు. వ్యాధుల నివారణ, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించామని, గ్రామ స్థాయిలో ఆరోగ్య పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.