రాజకీయాల్లో ఉన్నంత వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటానని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టుగా కొన్ని మీడియా ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కావాలనే తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే ఆలోచనే తనకు లేదని స్పష్టంగా చెప్పారు. దుష్ప్రచారాలను మానుకోవాలంటూ మీడియా ఛానళ్లకు సూచించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి భిక్షతోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచానని, వైయస్ఆర్ మరణం తరువాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ సీపీలో చేరిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని చెప్పారు.