రాష్ట్ర విద్యుత్, అటవీ, గనుల శాఖామంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైయస్ఆర్సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలో మూడోరోజు పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తు న్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి నెల్లిమంద కమ్మ పల్లె గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రశేఖర్ నాయుడు పార్టీలో చేరగా, ఆయనకు కండువా వేసి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరో ఇరవై కుటుంబాలవారు వైయస్ఆర్ సీపీలో చేరారు. మంత్రి వారికి కూడా పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గంతోపాటు తమ మండలానికి చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులైనట్టు తెలిపారు.