విజయవాడ నగరంలోని మారుతీనగర్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆకునూరి లిడియా అనే యువతి గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మాచవరం మారుతీనగర్‌లో లిడియా ఒంటిరిగా ఉంటోంది. డోర్నకల్ రోడ్డులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ యువతి పనిచేస్తోంది. లిడియా స్వస్థలం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కనుమోలు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.