వైసీపీపై ప్రజల్లో అసహనం తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో టీడీపీ, జనసేనలపై విపరీతంగా అభిమానం పెరిగిపోతోంది. టీడీపీపై జనంలో వస్తున్న ఆదరణకు ఆయన నిర్వహిస్తున్న సభలే నిదర్శనమైతే.. జనసేనపై ఆదరణకు ఈ ఘటనే నిదర్శనం. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అంచులవారిపాలెం వైఎస్సార్ ముగ్గుల పోటీలలో అధికార పార్టీకి ఓ మహిళ షాక్ ఇచ్చింది. అంబటి రాంబాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలలో జనసేన జండా గుర్తుతో ముగ్గు వేసి వైసీపీ వద్దు.. జనసేన ముద్దు అని కొటేషన్ రాసింది. ఇది చూసి నిర్వాహకులు సైతం నోరెళ్లబెట్టారు.