ఒకవైపు పోలీసుల ఆంక్షలు. బారికేడ్లతో ఎక్కడికక్కడ అడ్డగింతలు. అయినా టీడీపీ శ్రేణులు లెక్క చేయలేదు. దారి మళ్లి చంద్రబాబు సభలకు తరలివచ్చారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ.. గజమాలలతో స్వాగతం పలికారు. మహిళలు సంక్రాంతి గొబ్బెమ్మలు, కర్పూర హారతులిచ్చారు. గ్రామాల్లో ఎటు చూసినా పసుపు జెండాలు, టీడీపీ తోరణాలు రెపరెపలాడాయి. ప్రతిచోట ఆగుతూ.. ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు కదిలారు. ఇలా చివరి రోజైన శుక్రవారం గుడుపల్లె మండలంలో టీడీపీ అధినేత పర్యటన సాగింది.