రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి, రాష్ట్ర భవిష్యత్తును అందరం కాపాడుకోవాలని చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. శుక్రవారం రాత్రి కె.నాయుడుపాలెంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేసి, వైసీపీ అరాచకాలను ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంటు బిల్లులు, బస్‌చార్జీలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అనేక పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుములూరు చంద్రమౌళి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాడ చంద్ర, టీడీపీ నాయకులు సుర్ల బాబులునాయుడు, బంటు రాజు, పరవాడ నారాయణదొర, బంటు చిరంజీవి, వుండా రమణబాబు, కోలిపల్లి ఈశ్వరరావు పాల్గొన్నారు.