ప్రజాశ్రేయస్సు కోసమే జీవో నంబర్ 1 తీసుకొచ్చామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రోడ్‌షోలు ఆపుతామని, ర్యాలీలు ఆపుతామని ఎక్కడా పేర్కొనలేదన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర ప్రధాన రహదారులపై సభలు నిర్వహించవద్దని జీవో తెచ్చామన్నారు. జీవోలో ఏముందో తెలుసుకుని ప్రతిపక్షాలు మాట్లాడాలని హితవు పలికారు. పార్టీలను కట్టడి చేసేందుకు జీవో తెచ్చినట్లుగా చిత్రీకరిస్తున్నారు.