విశాఖలో వైసీపీ భారీగా భూ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. రూ.45 వేల కోట్ల ప్రైవేట్ భూములను ఏ2 విజయసాయి దోచుకున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులు, బ్రాందీ షాపులను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ అని అయ్యన్న విమర్శించారు. విశాఖ నుంచి ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయన్నారు. విద్యా, వైద్య రంగం మరింత అభివృద్ధి జరగాలన్నారు. రివర్స్ టెండరింగ్ అన్నారని.. ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల నుంచి వైసీపీ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌ను ఆపాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.