సలహాదారులపై కాంగ్రెస్ నేత డాక్టర్ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘వీరు సలహాదారు కాదు..స్వాహాదారులు. వైసీపీ నాయకులకు ఉపాధి హామీ పథకం. జగన్ అస్మదియులకు దోచి పెట్టే పథకం. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ఒకవైపు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండగా ప్రజాధనాన్ని సలహాదారుల పేరిట దుర్వినియోగం చేయడం భావ్యమా!. సలహాదారులు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం సమంజసంగా ఉంటుంది’’ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా కొందరు కాంట్రాక్టర్లు దొంగలుగా మారారని ఆయన విమర్శించారు.