వికలాంగులకు, దివ్యాంగులకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జనవరి 12 నుంచి 31 వరకూ టోకెన్లు విడుదల కానున్నాయి. జనవరి 10న వసతి గృహాలకు సంబంధించిన టోకెన్లు విడుదల కానున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 45,883 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. శ్రీవారికి నిన్న 17,702 మంది తలనీలాలు సమర్పించారు.