ప్రకాశం జిల్లా బీజేపీ లో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు రాజీనామాల బాట పట్టారు. ఈనెల 1న ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా శివారెడ్డి నియామకం జరిగింది. శివారెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ పాత అధ్యక్షుడు శ్రీనివాసరావుకు జిల్లా కార్యవర్గం రాజీనామాలు ఇచ్చింది. ఇప్పటి వరకు 100 మందికి పైగా జిల్లా బీజేపీ పదవులకు రాజీనామా చేశారు. ఏపీ బీజేపీని సోము వీర్రాజు సొంత కంపెనీలా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రాజీనామా చేసిన నాయకులతో బీజేపీ రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ చర్చలు జరుపుతున్నారు.