శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరులు తెలుగు దేశం పార్టీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీశైలానికి చెందిన టిడిపికి ముఖ్య నాయకుడు టిఎండి రఫీ ఆ పార్టీకి చెందిన 500 కుటుంబాలతో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై తాము వైయస్ఆర్ సీపీలో చేరినట్లు టీఎండీ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ బాటలో అడుగు వేస్తూ ప్రజల హృదయాలను దోచుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వెంట నడిచేందుకు ముందుకు వచ్చామన్నారు. ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి ,సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేస్తున్న శిల్పాకు మద్దతుగా ఉంటామని చెప్పారు.