రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం రాబోతోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ. ఈ ప్రాంతం ఫౌండేషన్ స్టోన్‌లకే పరిమితం అయింది. ఉత్తరాంధ్రలో మైనింగ్ మాఫియా పెరిగిపోయింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూట్ మ్యాప్ అవసరం. గిరిజనుల కోసం అరకు డిక్లరేషన్ చేస్తాం. సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి కావాలి. నిరుద్యోగులు కోచింగ్ కోసం దూర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.’’ అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.