ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం మరోసారి మార్చింది. మొదట 11 నుంచి 16వ తేదీ వరకూ విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. తిరిగి సెలవులను ఈ నెల 12 నుంచి 18కు మార్చేసింది. 11 నుంచి సెలవులు ఉంటాయనడంతో 10వ తేదీన కుటుంబాలతో.. స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సు, రైలు ప్రయాణానికి రిజర్వేషన్లు చేయించుకున్నారు. అసలే సంక్రాంతి అంటేనే టఫ్ టైమ్. ఈ సమయంలో సెలవులు మారడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతున్నారు. మళ్లీ రిజర్వేషన్లు ఎలా దొరుకుతాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అకస్మాత్తుగా సెలవు తేదీ 12కు మార్చడంపై ఏపీటీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపీటీఎఫ్ ఆరోపిస్తున్నారు.