అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లోని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(దిగువ సభ)కు స్పీకర్ గా రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్థీ ఎన్నికయ్యారు. 4 రోజులుగా జరుగుతున్న ఓటింగ్ లో 15వ రౌండ్ తర్వాత మెకార్థీ విజయం సాధించారు. ఈ సభలో రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ ఉండగా.. రెబల్స్ వల్ల కాంగ్రెస్ తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. మొత్తం 428 ఓట్లలో మెకార్థీకి 216, డెమొక్రాట్స్ అభ్యర్థి జెఫ్రీస్ కు 212 ఓట్లు వచ్చాయి.