బహిరంగ సభలు ప్రదర్శనలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కడప నగరంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, ఆర్ సిపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.