వైద్య సేవలకు వచ్చిన రోగులను రిఫర్ చేస్తే చర్యలు తప్పవని తూర్పు గోదావరి కలెక్టర్ కె.మాధవీలత హెచ్చరించారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిపై తరచుగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యం లో శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు.వార్డుల్లో పర్యటించి రోగుల నుంచి వైద్య సేవలపై ఆరాతీశా రు.గత పర్యటనలో పిడియాట్రిస్ట్, గైనకాలజిస్టు వైద్యులు లేరని చెప్పడంతో ప్రతి రోజు స్పెషలిస్టులు వైద్యసేవలందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వారానికి రెండు రోజులు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ వైద్యుల వివరాలను ప్రజలకు తెలిసే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. గైనకాలజిస్టు, ఆర్థో, పిడియాట్రిస్టు (పిల్లల వైద్య నిపుణులు)ల సేవలను కొవ్వూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.రోగులకు సేవలందించడానికి నిరాకరించినా,రిఫర్ చేసినా,ల్యాబ్‌లో పరీక్షలు చేయ కపోయినా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నా రు.కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఇకపై ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డా.కె.సనత్‌కుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో కె.వరలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంటు డా.ఎం.సుభాషిణి పాల్గొన్నారు.