రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం ఎక్కడుందో చెప్పాలంటూ ప్రతిపక్షాలను రాష్ట్ర మంత్రి బస్సు సత్యనారాయణ ప్రశ్నించారు. రహదారులపై సభలను నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ వన్ పై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విమర్శలు చేసే ముందు జీవోను క్షుణ్ణంగా చదవాలని సూచించారు. అసలు ఆ జీవోను ప్రతిపక్ష నేతలు చదివారా? అని ప్రశ్నించారు.
రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం ఎక్కడుందో విమర్శకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లపై బహిరంగసభలు పెట్టొద్దని మాత్రమే జీవోలో ఉందని చెప్పారు. ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని తెలిపారు. అవసరమైతే అనుమతి తీసుకుని బహిరంగసభలు పెట్టుకోవచ్చని చెప్పారు. వైఎస్సార్, జగన్ చేపట్టిన పాదయాత్రల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల పట్ల అన్ని పార్టీలు బాధ్యతలను తీసుకోవాలని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa