పెద్దాపురం, స్థానిక శ్రీప్రకాష్ సినర్జీస్ పాఠశాలలో ఈనెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్‌ప్రకాష్ తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని, దేశ వ్యాప్తంగా సుమారు 1200 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa