ఉస్మానియా యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో పీజీ చదివి సకాలంలో బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకోని విద్యార్థులకు ఓయూ మరో అవకాశం కల్పించింది. వారందరికీ మరోసారి పరీక్ష నిర్వహించేందుకు ఓయూ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. 2010-2017 సంవత్సరాల మధ్యచదివిన విద్యార్థుల బ్యాక్‌లాగ్స్‌ను క్లియర్ చేసుకోవడానికి అధికారులు ‘వన్ టైమ్ చాన్స్’ను తీసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa