రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కిట్లును ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. జీవో 16 ప్రకారం గతంలో ఈ పౌష్టికాహారం సరఫరా, బిల్లుల చెల్లింపులు అన్నీ ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల(జేసీ) ఆధ్వర్యంలో ప్రభుత్వ నియమించిన మానిటరింగ్ కమిటీ ద్వారా జరిగేవి. అయితే, ఇప్పుడు ఈ బిల్లుల చెల్లింపులకు జేసీల ప్రమేయం లేకుండా ఆయా జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లు(పీడీ) చెల్లించేలా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ పేరుతో రెండు సార్లు మెమోలు జారీ అయ్యాయి. ఈ మెమోల ఆధారంగా కాంట్రాక్టర్లకు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారుల ద్వారానే రూ.75 కోట్లు చెల్లింపులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం ఉల్లంఘించి డైరెక్టర్ ఇచ్చిన ‘మెమో’ ఆధారంగా చెల్లింపులు చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa