ఒక్క ఛాన్స్ పేరుతో సీఎం జగన్మోహన రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని టీడీపీ బీసీసెల్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఆవుల క్రిష్ణయ్య ఆగ్ర హం వ్యక్తం చేశాడు. ఆదివారం సాయంత్రం గార్లదిన్నె మండలంలోని మర్తాడు గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి గత ప్రభుత్వం పాలన ఎలా ఉంది? వైసీపీ పాలన ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..... సీఎం జగన్మో హనరెడ్డి రాష్ట్రాభివృద్ధి మరచి ధనార్జనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను గాలికివదిలేశారని ఆరోపించారు. చంద్రబాబునాయుడుకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక రాత్రికిరాత్రే చీకటి జీవోలు తేవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో గోసుల సుబ్బయ్య, గోరకాటి వెంకటేసు, ఆవులశీనా, మదమంచి శ్రీధర్నాయుడు, బీరే సుబ్బన్న, అనీఫ్, వెంకటేసు, చలపతి, గౌరీయల్లప్ప, పయ్యావుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.